రామ్ నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకుంటాడా?
ఊహించినట్టే పూరీ జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ని అధికారికంగా ప్రకటించారు. లైగర్ డిజాస్టర్ తర్వాత తిరిగి ఈ కాంబోలో సినిమా అసలుంటుందో లేదో అనే డౌట్ ఫ్యాన్స్ లో ఉన్నప్పటికీ, రామ్ అవేమీ పట్టించుకోకుండా పూరీని, తన కథని నమ్మి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఇస్మార్ట్ శంకర్ టైమ్ లోనే స్టార్ట్ చేసినప్పటికీ, రీసెంట్గా పూరీకి బాగా టైమ్ దొరకడంతో ఫైనల్ వెర్షన్ ను కంప్లీట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
ఎప్పటిలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా ఒకటికి పది సార్లు స్క్రిప్ట్ ని చెక్ చేసుకుని మరీ ఈసారి ముందడుగేస్తున్నాడట పూరీ. ఇదంతా బానే ఉంది కానీ సినిమా అనౌన్స్మెంట్ తో పాటే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రామ్ చేస్తున్న బోయపాటి సినిమా ఆగస్టు నాటికి పూర్తి కానుంది. అప్పటి నుంచి మొదలుపెట్టినా పూరీకి జస్ట్ ఆరు నెలలే టైమ్ ఉన్నట్లు.
ఇంత తక్కువ టైమ్ లో సినిమా పూర్తి చేయడం పూరీకి కొత్తేమీ కాదు. కానీ పూరీ ట్రాక్ రికార్డు ఇంతకుముందులా లేదు. లైగర్ ఎఫెక్ట్ పూరీ మీద, అతని మార్కెట్ మీద దారుణంగా ఉంది. దాని నష్టాలను పూడ్చాలని డిస్ట్రిబ్యూటర్లు హైదరాబాద్లో ధర్నాకు దిగారు. దీని వల్ల జరగబోయే డ్యామేజ్ ఇప్పుడైతే ఏముండదు కానీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ టైమ్ లో మాత్రం అది ఖచ్చితంగా ఉంటుంది.
ఏదేమైనా సరే పూరీ స్పీడు గా సినిమా చేయడానికే ముందుకొచ్చాడు. ఇక్కడ ఆడియన్స్ కంటే కూడా, తనని ఎక్కువగా నమ్మిన రామ్ నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకోవాల్సి ఉంది. ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయినా సరే ఆ టైమ్ లో కొన్ని కలిసిరావడం వల్ల మాత్రమే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తప్పించి ఇస్మార్ట్ శంకర్ ఆల్ టైమ్ హిట్ అయితే కాదు. మరి డబుల్ ఇస్మార్ట్ తో అయినా పూరీ ఆల్ టైమ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.













