Ram Pothineni: రామ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఓ వైపు యంగ్ హీరోలంతా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంటే రామ్ మాత్రం కష్టపడుతున్నప్పటికీ ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరు లానే అయిపోతుంది. ఇప్పటివరకు రామ్ చేసిన సినిమాల్లో సక్సెస్ కంటే ఫెయిల్ అయినవే ఎక్కువ.
ఇదిలా ఉంటే రామ్ ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty)తో మెప్పించిన మహేష్ ఇప్పుడు రామ్(Ram) తో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కథతో పాటూ రామ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. చూస్తుంటే ఈసారి రామ్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తోంది.
స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నా రామ్ కు ఫ్లాపులు తప్పడం లేదు. రీసెంట్ గా వచ్చిన యంగ్ హీరోలు కూడా డిఫరెంట్ కథలతో రూ.100 కోట్లు కొడుతుంటే రామ్ మాత్రం ఇంకా మొదట్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్ గా నటిస్తోంది.













