రామ్ ఆశలన్నీ బోయపాటిపైనే
ఎంతో కాలంగా టాలీవుడ్ లోని టైర్2 హీరోలు ఒక్కొకరిగా తమ లీగ్ నుంచి టాప్ లీగ్ లోకి వెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఈ సమ్మర్ లో దసరా సినిమాతో నాని తన క్రేజ్ ను పెంచుకుని మార్కెట్ ను మరింత పెంచుకున్నాడు. ఖుషి సినిమా హిట్ అయితే విజయ్ రేంజ్ మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరితో పాటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా స్కంద సినిమాతో తన రేంజ్ ను, మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. నిజానికి బోయపాటి శ్రీను తో స్కంద సినిమాను అనౌన్స్ చేసినప్పుడే రామ్ రేంజ్ మారిందని చెప్పాలి. వీరి కాంబోలో వస్తున్న స్కంద కు వస్తున్న బిజినెస్ డీల్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడం, స్కంద ప్రోమో, సాంగ్స్ అన్నీ మాస్ ను ఉద్దేశించి తీసినట్లుండటం వల్ల దీనికి మంచి డీల్స్ వస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతున్నట్లు తెలుస్తోంది. రామ్ రేంజ్‌కు ఇది చాలా పెద్ద బిజినెస్ డీల్ అని చెప్పుకోవాలి.
రామ్ ని నమ్మి అతడి స్థాయికి ఈ రేంజ్ పెట్టుబడి పెట్టడం రిస్క్ అయినప్పటికీ, బోయపాటిని చూసి ధైర్యంతో తమ డబ్బులు వెనక్కి రాబట్టుకోగలమని బయ్యర్లు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి స్కంద తో రామ్ తన రేంజ్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్తాడా లేదా అన్నది చూడాలి.













