బోయపాటి-రామ్ ఏం చేస్తారో?
బాలయ్యతో అఖండ పేరిట బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న బోయపాటి తన తర్వాతి సినిమాను ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ఫిక్స్ చేసుకున్నాడు. బోయపాటి, రామ్ ఇద్దరి కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ అందరినీ తెగ ఎగ్జయిట్ అయ్యేలా చేస్తుంది.
రామ్ కెరీర్లో 20వ సినిమాగా తెరకెక్కుతున్నఈ సినిమా కోసం రామ్ తన లుక్ మొత్తం మార్చినట్లు చాలా బాగా అర్థమవుతుంది. సినిమాలో రామ్ క్యారెక్టర్లో చాలా ట్విస్ట్‌లు ఉండనున్నాయట. హీరో క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని, ఆ వేరియేషన్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తాయని ఇటు బోయపాటి, అటు రామ్ ఇద్దరూ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్నా హీరో యాటిట్యూట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే బోయపాటి హీరో క్యారెక్టర్ విషయంలో కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ కెరీర్లోనే పెద్ద బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకొని, మంచి పేరు తెచ్చుకున్న శ్రీ లీల ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ కానుంది.
ఎప్పటిలా కాకుండా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా రామ్ ఈ సినిమా చేస్తున్నాడు. బోయపాటి సినిమాలో హీరో ఏ రేంజ్లో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లుగా రామ్ తనని తాను మలుచుకోవడానికి బాగా వర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. రామ్ రీసెంట్ సినిమా ది వారియర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు రామ్.
థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి పండగే. బోయపాటి డైరెక్షన్, రామ్ ఎనర్జీ ఈ రెండూ కలిస్తే ఇక చెప్పనక్కర్లేదు. ఈ కాంబోలో కరెక్ట్ కంటెంట్‌తో, కాస్త మంచి సినిమా వచ్చినా మూవీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే చెప్పాలి. మరి రామ్ తో బోయపాటి చేస్తున్న ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి.













