రొమాంటిక్ కు అతిథిగా రామ్
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. కేతికా శర్మ కథానాయిక. ఈ చిత్రానికి పూరి కథ, కథనం అందించడమే కాదు, నిర్మాత గానూ వ్యవహరిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకుడు రామ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల గోవాలో రొమాంటిక్ షూటింగ్ జరిగింది. అక్కడే రామ్కి సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. రామ్-పూరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ లోనూ రామ్.. ఇస్మార్ట్ శంకర్గానే కనిపిస్తారని సమచారం.













