రాంగోపాల్ వర్మ వర్సెస్ నట్టి కుమార్ : ‘నా ఇష్టం’ సినిమా ఫైనాన్స్ ఇష్యూ పై ఒకరిపైకొకరు ఆరోపణలు!
రాం గోపాల్ వర్మ ప్రెస్ నోట్
గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు ఆ క్రింది కోర్టు ఇచ్చిన injunction ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది నేను ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంభందించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణ ల ఫాదర్ అయినటువంటి నట్టి కుమార్ మీద నేను , తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు forged డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద damage కేసు వెయ్యబోతున్నాము ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని May 6 న విడుదల చెయ్య బోతున్నాము. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ లు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని , యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను ..జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను.. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది.
నట్టి కుమార్ ప్రెస్ నోట్
రాంగోపాల్ వర్మ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నట్టి కుమార్
నువ్వు రాసి ఇచ్చిన అగ్రీమెంట్లు, చెక్కులు అన్నీ ఫోర్జరీ నే అంటావా లీగల్ గా తేల్చుకుంటాం. రాంగోపాల్ వర్మ…నువ్వు, అలాగే నీ తాత్కాలిక మరో స్నేహితుడు రామసత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజ స్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. అందుకే నీకు ఈ విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యహరిస్తున్నావు. మా ఇష్టం (డేంజరస్), హిందీ “ఖత్రా” చిత్రం విడుదలపై మేము స్టే తేవడంతో ఆగిపోయిన. విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని రోజుల వరకు మెదలకుండా ఉండి…. ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ఓ నీచమైన పధకం రచించి, ఓ ప్రెస్ నోట్ తో బయటకు వచ్చిన నీ కుట్రలు ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమైపోతాయి. నీ సినిమాకు ఖర్చు లేకుండా సులువుగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి పథక రచన చేశావు. అయినా ఈ మేటర్ కోర్టు పరిధిలో ఉన్నది. నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకపోతే డబ్బు విషయంలో నీ చేతిలో మోసపోయిన మమ్ములను కూడా నీ గురించి తెలియనివాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే సూటిగా ఈ సమాధానం ఇస్తున్నాను.













