నేకేడ్ సెల్ ఫోన్‌తో తీసా… ఏ యాంగిల్ అయినా ఎక్కడైతే అక్కడ పెట్టి తియ్యొచ్చు
కరోనా పరిస్థితుల్లో సినిమా హాళ్లు మూతపడితే.. దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసి ఓటీటీ ఫ్లాట్‌ఫాం రిలీజ్ చేసుకొన్నారు. ఇటీవల తీసిన క్లైమాక్స్ సినిమాను ఆర్జీవి వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేస్తే బ్రహ్మండమైన రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఇక అదే ఊపుతో యూత్ ని టార్గెట్ చేస్తూ నెకెడ్, నగ్నం అనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. సోమవారం ఆ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడుతూ..
” OTT కాన్సెప్ట్ నాలుగైదు సంవత్సరాలుగా చాపకింద నీరులా ప్రవేశించింది. అప్పుడే నేను దానిని ప్రాధాన్యతను గ్రహించాను. చాలా మందికి చెబితే కాన్సెప్ట్ అర్ధం కాలేదు. ఇప్పుడు దాని విలువ అందరికి తెలుస్తున్నది. సినిమా పరిశ్రమలో ఉండే అన్ని రకాలు ఖర్చులను ఈ విధానం తగ్గిస్తుందనే స్పష్టం అని వర్మ తెలిపారు. క్లైమాక్స్ సినిమాను కేవలం 12 గంటల్లో లక్షల మంది చూశారు. నెకెడ్ సినిమాలో వీఎఫెఎక్స్ ఉండవు. పెద్ద పెద్ద కెమెరాలతో తీయలేదు. కొన్ని అవుట్ ఫోకస్ షాట్స్ ఉన్నాయంతే. నేను తీసిన సినిమాను నా థియేటర్లలో ఆడించుకొంటాను. నాకు ఉన్న బడ్జెట్, నా ఐడియాకు నాకు ఎంత వచ్చిందనే ముఖ్యం. ఇప్పుడు ఇక నేను తీసిన నెకెడ్ (NAKED నగ్నం नंगा ) ఈ చిత్రంలో పేరున్న నటీనటులు లేరు. ఎక్స్రార్డినరీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ లేవు. కేవలం సెల్‌ఫోన్‌తోనే తీశాను. ఈ సినిమా చూడటానికి నేను ప్రేక్షకులకు పెట్టిన ధర రూ.200. ఈ ధర నేను ప్రొడక్షన్ కాస్ట్ కోసం కాదు. నా ఐడియా కోసం, నేను అమ్మాయిని ఒప్పించిన విధానం కోసం నేను తీసుకొంటున్న పారితోషికం. ఇవన్నీ నేను డైరెక్ట్‌గా టెలివిజన్‌లో చెప్పాను. ఇంట్రస్ట్ ఉంటే చూస్తారు… NNN సినిమా కోసం నేను సెల్‌ఫోన్‌నే వాడి సినిమా షూట్ చేశాను. ఎందుకంటే నగ్నం అనే సినిమాను సెల్‌ఫోన్‌తో షూట్ చేయడానికి కారణం కెమెరా యాంగిల్స్ సౌలభ్యం కోసం. పెద్ద కెమెరా పెడితే యాంగిల్స్‌ను క్యాప్చర్ చేయలేం. సెల్‌ఫోన్ అయితే ఎక్కడైతే అక్కడ పెట్టి తీసే సౌలభ్యం ఉంటుంది. నెకెడ్లో అమ్మాయి కాళ్లు చూపించాం.
కరోనావైరస్ పరిస్థితులే నన్ను యాప్‌లో ఆర్జీవీ వరల్డ్ అనే థియేటర్‌ను ఏర్పాటు చేయడానికి కారణమైంది. కోవిడ్ 19 పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ సినిమా రిలీజ్ చేసి 2 కోట్లకుపైగా డబ్బులు సంపాదించాను. నాకు, ప్రేక్షకుడికి మధ్య ఎలాంటి మధ్యవర్తి లేరు. ఇక నెక్ట్స్ నేను ప్రదర్శించే సినిమా నెకెడ్ను రిలీజ్ చేస్తున్నాను. ఆ సినిమా 14 నిమిషాలే ఉంటుంది. దాని టికెట్ ధర రూ.200 పెట్టాను. ఇష్టమున్న వాళ్లు చూస్తారు. ఇష్టం లేని వాళ్లు చూడరు. ఎంత మంది చూస్తారనే నాకు అనవసరం.” అంటూ ఓపెన్ గా వివరించాడు రాంగోపాలా వర్మ.













