సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం : వర్మ
మా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఒక పౌరుడిగా గౌరవిస్తూనే, న్యాయం కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని నిర్ణయించాం అన్నారు ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆయన అగస్త్య మంజుతో కలిసి నిర్మించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. రాకేశ్రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో రామ్గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు. త్వరలో ఏపీలో చిత్రం విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.













