విజయవాడ అమ్మాయి దక్షి గుత్తికొండ పై రామ్ గోపాల్ వర్మ టార్గెట్

‘రాజా చేయి వేస్తె అది రాంగ్ అయిపోదు లేరా!’ విచిత్ర సోదరులు లోని సాంగ్ అది. ఆ పాటను అక్షలారా అమలు చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ, వర్మ చెయ్యి వేస్తే…. ఏ అమ్మాయి అయినా సరే ఫేమస్ కావాల్సిందే. ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిలను గ్లామర్ తారలుగా పాపులారిటీ తెచ్చిన ఆర్జీవీ తాజాగా మరో హీరోయిన్‌ని ఫేమస్ చేసే పని పెట్టుకున్నారు. వివాదాస్పద దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలవని రోజు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రపంచంలోని సినీ రాజకీయ అంశాలను ఓపెన్‌గా తనకు అనిపించింది చెప్పేయడం ఆర్జీవీ స్టైల్. రెచ్చగొట్టేలా మాట్లాడటం, దానికి రొమాంటిక్ సెన్స్ యాడ్ చేయడంలో వర్మను మించిన వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఇష్యూ ఏదైనా సరే తన అభిప్రాయం ఇదీ అంటూ నిర్మొహమాటంగా చెప్పే ఆయన.. సినిమాల పరంగానూ తన దారి తనదే అంటూ డిఫరెంట్ రూట్‌లో వెళ్తున్నారు. ఓ అమ్మాయిపై ఆర్జీవీ కన్ను పడిందంటే ఆమె ఫేమస్ కావడం పక్కా. ఇప్పటికే ఇది చాలా సందర్భాల్లో నిరూపించాడు కూడా. కొత్త కొత్త హీరోయిన్లను పట్టుకొచ్చి వారి అందాలను కెమెరాలో బంధించే ఆర్జీవీ మరోపక్క పాపులర్ ఛానల్స్ , యు ట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో కూడా అందాల యాంకర్స్ సైతం అస్సలు వదిలిపెట్టడు. వారిపై ఏదో ఒక కామెంట్ చేసి ఆ యాంకర్స్ పేర్లను జనం నోళ్ళలో నానేలా చేస్తుంటారు. ఆ లిస్ట్ చూస్తే ప్రముఖంగా అరియానా, అప్సర రాణి, నైనా గంగూలీ పేర్లు ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరో హీరోయిన్ హాట్ పోజులను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఆన్‌లైన్ మాధ్యమాలను వేడెక్కించారు వర్మ. తను పరిచయం చేసే హీరోయిన్లను ఆర్జీవీ ఎంత హాట్‌గా స్క్రీన్‌పై చూపిస్తారో మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే 2020 లాక్‌డౌన్ సమయంలో ‘కరోనా వైరస్’ అనే ఒక గంట 24 నిమిషాల నిడివి గల సినిమాతో హీరోయిన్ దక్షి గుత్తికొండను హైలైట్ చేశారు. ఇప్పుడు ఆ బెజవాడ అమ్మాయికి మరింత పాపులారిటీ దక్కేలా ఆమె బికినీ పోజులను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేశాడు వర్మ. అంతేకాదు దక్షి గుత్తికొండ న్యూ అవతార్ ఫొటోలు ఇవేనంటూ పిచ్చెక్కించే పిక్స్ షేర్ చేశారు. దీంతో ఈ హాట్ హాట్ ఫొటోలు చూసిన నెటిజన్లు తమ కామెంట్లకు పదును పెడుతూ మాటల్లో చెప్పలేని విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా దక్షి గుత్తికొండకు ఇది బెస్ట్ ప్రమోషనే అని చెప్పుకోవచ్చు.