ఏపీకి రావాలంటే వీసాలు తీసుకోవాలా ?
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడలో మీడియా సమావేశం పెట్టడానికి తనకు ఏపీ పోలీసులు అనుమతివ్వడం లేదని చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. హైదరాబాద్‌లో ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని అడిగినా అనుమతి లేదంటున్నారు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయని, సమావేశాన్ని నిర్వహించకూడదని అంటున్నారు. ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేదా నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. ఏపీకి రావాలంటే వీసాలు తీసుకోవాలా? మేము అని పేర్కొన్నారు.













