త్వరలో కేసీఆర్ బయోపిక్ : వర్మ
తెలుగునాట బయోపిక్‌లకు పెద్దగా ఆదరణ దక్కకున్నా, కొంతమంది దర్శకులు ఇంకా ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్కులుగా తెరకెక్కించే ఆలోచనలు చేస్తునే ఉన్నారు. తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ సీఎం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ బయోపిక్‌ను కూడా తరువాత చిత్రంగా తియ్యబోతున్నట్టు తెలిపారు. మరి కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే రామ్‌గోపాల్‌వర్మ ఈ బయోపిక్‌ను ఎప్పుడు మొదలు పెడతారో, ఇతర నటీనటులుగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రామ్ గోపాల్‌వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు ఘట్టాల్ని ప్రధానాంశంగా తీసుకుని వర్మ తీసిన చిత్రం కొన్ని సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరికీ విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది.













