Ram Charan- Balayya: భలే కబుర్లు చెప్పిన చరణ్
అందరూ ఎంతగానో ఎదురు చూసిన అన్‌స్టాపబుల్4(Unstoppable4) నుంచి రామ్ చరణ్(Ram Charan) ఎపిసోడ్ నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసిన ఆహా టీమ్ ఫుల్ ఎపిసోడ్‌తో మంచి వ్యూస్ ను అందుకుంటుంది. చరణ్ పాల్గొన్న ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ గంటా పది నిమిషాల నిడివితో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
ఈ ఎపిసోడ్లో ముందుగా నట వారసత్వం గురించి టాపిక్రాగా దాని వల్ల చరణ్ ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు వివరించాడు. ఎపిసోడ్ మొత్తం బాలయ్య(Balayya) బ్రో అని పిలవమని పదే పదే చెప్పినా సరే చరణ్ మాత్రం కాస్త తగ్గి బ్రో సార్ అని పిలవడం, ఇద్దరూ పరస్పరం కవ్వించుకోవడం చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
చిరూ(Chiru), నాగబాబు(Naga babu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో తన అనుబంధాన్ని గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చరణ్ ఈ ఎపిసోడ్లో రివీల్ చేశాడు. తన చిన్న తనంలో చిరూతో ఒకే ఒకసారి దెబ్బలు తిన్న విషయంతో పాటూ దానికి కారణాన్ని కూడా వెల్లడించాడు చరణ్. ఎపిసోడ్ మొత్తంలో చరణ్ నానమ్మ అంజనా దేవి(Anjana Devi), తల్లి సురేఖ(Surekha) స్పెషల్ వీడియోలో చెప్పిన కొన్ని విషయాలు, సీక్రెట్స్ మరో హైలైట్ గా నిలిచింది. అంతేకాదు ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్నో అలరించే విషయాలున్నాయి. అవన్నీ చెప్పడం కంటే నేరుగా చూస్తేనే బావుంటుంది. చరణ్, ప్రభాస్(Prabhas) కు ఫోన్ చేయడం, శర్వా(Sharwanand), యువి విక్రమ్(UV Vikram) వచ్చి ఏం మాట్లాడతారనే కంటెంట్ కూడా నెక్ట్స్ పార్ట్ లోనే రిలీజ్ కానుంది.













