Ram Charan: మామతో పార్టీకి వెళ్తానంటున్న చెర్రీ
రామ్ చరణ్(ram charan) నటించిన గేమ్ ఛేంజర్(game changer) సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఆహా(Aha) నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ షో కు గెస్టుగా వచ్చి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)తో పలు విషయాలు పంచుకున్నాడు. రీసెంట్ గా ఆ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజై నెట్టింట అది వైరలవుతుంది.
అయితే ఈ షోలో బాలయ్య(balayya) అడిగిన ఓ చిలిపి ప్రశ్నకు చరణ్ చెప్పిన సమాధానం అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Nagababu), పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఉన్న ఫోటో చరణ్ కు చూపించి వీరి ముగ్గురిలో పార్టీకి వెళ్లాలంటే ఎవరితో వెళ్తావని బాలయ్య అడిగాడు. దానికి చరణ్ స్పందిస్తూ వీళ్ల ముగ్గురితో వెళ్లను. మా మామతో వెళ్తానని చెప్పాడు.
అంతేకాదు అరవింద్(Allu Aravind) మామ పార్టీకి బెస్ట్ అని చరణ్ కితాబిచ్చాడు. చిరు, పవన్ పార్టీలకు దూరంగా హుందాగాఉంటారు. అరవింద్ కూడా వయసు రీత్యా పెద్ద అయినప్పటికీ ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టాడనికే చరణ్ ఈ మాట అన్నాడని అందరూ కామెంట్ చేస్తున్నారు. చరణ్ చెప్పిన ఈ మాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. బుధవారం రాత్రి నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.













