‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్ అదుర్స్
బోయపాటి దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా ‘వినయ విధేయ రామ’ సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. దీపావళి కానుకగా కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి చరణ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.













