ఆ డైరెక్టర్‌తో చరణ్ సినిమా.. ఛాన్సే లేదు
రీసెంట్ గా రామ్ చరణ్ ముంబై కి వెళ్లి అయ్యప్ప దీక్షను విరమించుకోవడం, సిద్ది వినాయకుడి టెంపుల్‌కు వెళ్లడం, ఆ తర్వాత ధోనీతో దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఓ యాడ్ షూట్ కోసం ముంబైలో ధోనీని కలిసిన చరణ్‌తో డుంకీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో డిస్కషన్స్ జరిపాడన్న వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
చరణ్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో సినిమా వస్తుందని, దాని కోసమే వీరిద్దరూ కలిశారని ప్రచారమవుతుంది. ఒకవేళ వీరిద్దరూ కలిసింది నిజమే అయినా వీరి కాంబోలో సినిమా రావడమనేది దాదాపు కష్టమే. నాలుగేళ్లకో సినిమా తీసే రాజ్ కుమార్ హిరానీతో ఫాస్ట్ గా సినిమాలు చేయాలనుకుంటున్న చరణ్ సినిమా ఒప్పుకుంటాడంటే నమ్మశక్యంగా లేదు.
ఇప్పటికే అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న రాజ్ కుమార్ హిరానీ, ఇకపై తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఆయన్నుంచి సినిమా రావడానికి మరో నాలుగేళ్లు ఈజీగా పడుతుంది. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చి బాబు సాన తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను అంటే ఆర్సి17ను ఎవరితో చేస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.













