ఆ ఇద్దరికి చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాడా?
మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ రైట్స్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో పవన్ కళ్యాణ్, చరణ్ కలిసి ఈ సినిమా చేస్తారనే న్యూస్ కూడా అప్పట్లో వచ్చింది. అయితే వీరిద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉండటంతో వీరి కాంబోలో ఈ సినిమా కష్టమని డిసైడ్ అయ్యారంతా. అయితే ఇప్పుడు రామ్ చరణ్ బయటి హీరోతో ఈ మల్టీస్టారర్ ని పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది.
కొన్ని పరిస్థితుల వల్ల విరోధులుగా మారిన మీరో, తనను అభిమానించే ఒక ఆర్టీఏ ఆఫీసర్ మధ్య జరిగిన సంఘటన సమూహారమే మలయాళ డ్రైవింగ్ లైసెన్స్ కథ. సింపుల్ స్టోరీ తో తెరకెక్కినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ గా బాగానే కలెక్ట్ చేసింది. పృథ్వీరాజ్ మరియు సూరజ్ మెయిన్ క్యారెక్టర్లలో కనిపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. అయితే ఇప్పుడు తెలుగు రీమేక్ లో హీరో క్యారెక్టర్ కోసం రవితేజ ను, ఆర్టీఏ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని ప్లాన్ చేస్తున్నాడట చరణ్. ఒకే సారి తెలుగు తమిళ భాషల్లో ఈ రీమేక్ ను రిలీజ్ చేయాలని రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఇటు రవితేజ, అటు విజయ్ సేతుపతి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.













