బాలయ్య టాక్ షోకు రామ్ చరణ్?
ఆహా(Aha)లో వచ్చే అన్స్టాపబుల్(Unstoppable) షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ ను మొదలుపెట్టుకుంది. నిన్న మొదటి ఎపిసోడ్ రిలీజైంది. అయితే గత మూడు సీజన్లలో రామ్ చరణ్(ram charan) వస్తాడేమో అని మెగా ఫ్యాన్స్ తెగ ఎదురుచూశారు. కానీ అది జరగలేదు. ప్రభాస్(Prabhas) ఎపిసోడ్లో ఫోన్ లో మాట్లాడటం తప్పించి రామ్ చరణ్ డైరెక్ట్ గా షోకు వచ్చింది లేదు.
బాలయ్య(Balakrishna)కు, రామ్ చరణ్ కు మధ్య మంచి రాపోనే ఉందని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సీజన్4లో ఓ ఎపిసోడ్కు గెస్టుగా రానున్నట్లు తెలుస్తోంది. దానికి ఆహా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. షూటింగ్ ఎప్పుడనేది తెలీదు కానీ త్వరలోనే ఇది జరగనున్నట్లు టాక్. జనవరిలో గేమ్ ఛేంజర్(game changer) రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్స్ కు ఈ ఎపిసోడ్ బాగా ఉపయోగపడుతుంది.
అయితే ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నుంచి బాలయ్య ఎలాంటి విషయాలను రాబడతాడో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. బాబాయి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి, చిరంజీవి(chiranjeevi)తో బాలయ్య(NBK)కు ఉన్న అనుబంధం గురించి, మెగా నందమూరి కుటుంబాల మధ్య ఉన్న స్నేహంతో పాటూ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన వివరాలు కూడా ఈ టాక్ షో లో బయటకు రానున్నాయి. నాలుగో సీజన్ లో ఎవరూ ఊహించనంత కంటెంట్ ఉంటుందని మొదటి నుంచి ఊరించిన టీమ్ దానికి తగ్గట్టే ఈ సీజన్ ను ప్లాన్ చేసింది.













