రామ్ చరణ్ స్పీచ్‌కు అందరూ ఫిదా

నందమూరి హీరోలను మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు పొగిడినా, మెగా హీరోలను నందమూరి ఫ్యామిలీకి చెందిన వారు పొగిడినా అందరికీ ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సినిమాల పరంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న పోరు అలాంటిది. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోలు ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అవేమీ పట్టకుండా ప్రవర్తిస్తుంటారు.
అందుకే రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ కలిసి ఆర్ఆర్ఆర్ లో నటించినా, పర్సనల్‌గా తాము చాలా క్లోజ్ అని సభాముఖంగా చెప్పినా ఫ్యాన్స్ లో మాత్రం ఆ గోల కాస్త కూడా తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రామ్ చరణ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకర్షించింది. ఏ మాత్రం జంకకుండా, రామ్ చరణ్ సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు.
ఏదో ఇప్పుడు అందరూ సౌత్ ఫిల్మ్స్‌ని, తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిందాని గురించి మాట్లాడుతున్నారు కానీ అప్పట్లోనే తెలుగు వాళ్లు, తెలుగు సినిమాల స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ కే చెందుతుందని రామ్ చరణ్ అన్నాడు. తెలుగు సినిమా బతికున్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని చరణ్ అభిప్రాయపడ్డాడు. ఆయన ఉన్న ఇండస్రీలో తాను కూడా భాగమైనందుకు గర్విస్తున్నానని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
గతంలో ఓసారి పురంధేశ్వరి కొడుకుతో కలిసి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైమ్ లో ఉదయం ఆరు గంటలకు ఆయన ఇంటికెళ్తే చికెన్ తో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఆయన, తనక్కూడా టిఫిన్ పెట్టించడాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని చరణ్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు స్పీచ్ లాస్ట్ లో ఈ వేడుకను నిర్వహించిన మా చంద్రబాబు నాయుడి గారికి, తనను ఆహ్వానించిన మన బాలయ్య గారికి అని చరణ్ అన్న మాటలకు అందరూ ఫిదా అవుతున్నారు.











































































