చిరంజీవి రెండు పాత్రలు.. రామ్‌చరణ్ క్యారెక్టర్ `ఆచార్య`కు కీలకం!
ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న `ఆచార్య` కూడా ఒకటి. సినిమా షూటింగ్ కొంతవరకు జరిగిన తర్వాత లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంలో సరైన క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది. తాజాగా వచ్చిన అప్డే్ట్ ఏమిటంటే ఈ సినిమా చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకరు లెక్చరర్ కాగా, మరొకరు కామన్ మేన్‌గా కనిపిస్తారు. రామ్‌చరణ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. లెక్చరర్, స్టూడెంట్ క్యారెక్టర్లను చాలా స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారట కొరటాల. గతంలో చిరంజీవి చెప్పినట్టు తన క్యారెక్టర్ జనతాగ్యారేజ్‌లో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సహజ వనరులపై పోరాటం సాగించే ప్రొఫెసర్‌గా కనిపిస్తారట. అంతేకాదు, ఫ్లాష్‌బ్యాక్‌లో చిరంజీవి నక్సలైట్గాను, రామ్‌చరణ్ అతని గైడ్ చేసే వ్యక్తిగానూ.. ఇద్దరూ పవర్ఫుల్ క్యారెక్టర్స్ పోషిస్తున్నారని సమాచారం.
ఇప్పటివరకు అందిన ఈ అప్డేట్స్ని బట్టి `ఆచార్య` కథ, కథనాల్లో ఎంతో కొత్తదనం ఉందనేది అర్థమవుతోంది. వీటిని బట్టి ఇదేదో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనుకుంటే పొరపాటే. చిరంజీవి, రామ్‌చరణ్ సినిమాల్లో ఏయే అంశాలు ఉండాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటారో ఈ సినిమాలో అవన్నీ ఉంటాయట. ఈ సినిమాకి సంబంధించి మరో విశేషమేమిటంటే నిహారిక కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తోందట. సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఒక క్యారెక్టర్ చేసిన నిహారిక ఈ సినిమా కూడా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తోంది.
ఇప్పటివరకు జరిగిన షూటింగ్ తాలూకు విషయాలను ఆమధ్య చిరంజీవి ఓ ఇంటర్వూలో వెల్లడించారు. ఒక అద్భుతమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని అన్నారు. దర్శకుడు కొరటాల శివ గురించి మాట్లాడుతూ “కొరటాల వర్కింగ్ స్టయిల్ ఎంతో బాగుంది. ఆయనతో కలిసి సినిమా చేయడం ఓ మంచి ఎక్స్పీరియన్స్“ అన్నారు. కొన్ని వందల సినిమాలు చేసిన చిరంజీవి ఎంతో మంది దర్శకులతో కలిసి పనిచేసారు. అలాంటిది కొరటాలను ప్రత్యేకంగా పొగడడం విశేషంగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో `ఆచార్య` చిత్రం బ్యాలెన్స్ వర్క్‌పైనే పూర్తి దృష్టి పెట్టారు కొరటాల. బ్యాలెన్స్ స్క్రిప్ట్‌ని ఇంకా పక్కాగా రెడీ చేసే పనిలో ఉన్నారట.













