సిద్ధ కోసం రెయిన్ ఫైట్ ను ప్లాన్ చేసిన కొరటాల
ఆచార్యలో రామ్ చరణ్ టాకీ పార్ట్ పూర్తయిందనే వార్తలొచ్చినప్పటికీ, ఇంకా యాక్షన్ సీక్వెన్స్ బాకీ ఉన్నట్లు తెలుస్తుంది. సిద్ధ గా చెర్రీ చేసే యాక్షన్ సీన్స్ ను ప్రస్తుతం షూట్ చేస్తున్నారనీ, దానికి యూనిట్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. మామూలుగా వాన పాటలకు సినిమాల్లో ఎంత క్రేజ్ ఉంటుందో, రెయిన్ ఫైట్ కు కూడా అంతకుమించిన రేంజ్ లో ఉంటుంది. అందుకే ఈ సినిమాలో రెయిన్ లో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట శివ.
అయితే ఈ ఫైట్ లో రామ్ చరణ్, సోనూ సూద్ తో తలపడనున్నట్లు తెలుస్తుంది. సోనూసూద్ ఆచార్యలో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరితో సాలిడ్ ఫైట్ ను ప్లాన్ చేశాడట సోనూ సూద్. మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో చూడాల్సి ఉంది.
ఇక పోతే సినిమాలో చిరూ, చరణ్ లిద్దరూ నక్సలైట్లుగా కనిపించబోతున్నవిషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరికీ సంబంధించి రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది. దానికి తోడు ఫస్ట్ సింగగిల్ లాహే లాహే కూడా అందరిన్నీ మెప్పిస్తుంది. కాగా చిరూ కి జంటగా కాజల్, చరణ్ కు జంటగా పూజా హెగ్డే లు నటించనున్నారు. ఈ సినిమా మే13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి కరోనా నేపథ్యంలో ఆచార్య థియేటర్లకు చెప్పిన టైమ్ కు వస్తుందా లేదా అన్నది చూడాలి.













