రామ్ చరణ్ ప్లానింగ్ భలేగుందే..
రంగస్థలంతో నాన్ బాహుబలి హిట్ కొట్టిన తర్వాత వినయ విధేయ రామ లాంటి సినిమా చేయడం పెద్ద తప్పని అర్థం చేసుకున్న దగ్గర నుంచి తన సినిమాల సెలెక్షన్ లో చాలా జాగ్రత్తలు వేస్తున్నాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తనకు తిరుగులేని ఇమేజ్ దక్కి పాన్ ఇండియా స్టార్ గా తన పేరు మార్మోగిపోతుందని ధీమాగా ఉన్నాడు చరణ్.
ఈ నేపథ్యంలో తన ఇమేజ్ కు తగ్గట్లుగానే కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. సౌత్ ఇండియాలోనే తిరుగులేని స్థాయిని అందుకున్న శంకర్ తో చరణ్ తన తర్వాతి సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కనుంది. అలాగే చరణ్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాను కూడా ప్లాన్ చేసుకున్నాడు.
జెర్స్ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరరణ్ సినిమా చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. ఈ ఇయర్ మొదటినుంచే ఇది చర్చల్లో ఉంది. ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు అయినట్లు సమాచారం. అతి త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా రానుందట. ఉగాదికి ఈ సినిమా ప్రకటన ఉండొచ్చని భావిస్తున్నారు. జెర్సీ హిందీ వెర్షన్ ను కూడా గౌతమ్ డైరక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యాక గౌతమ్ పేరు బాలీవుడ్ లో కూడా మార్మోగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఈలోపు ఆర్ఆర్ఆర్ తో చరణ్ కూడా నేషనల్ లెవల్ లో ఇమేజ్ తెచ్చుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఆ సినిమాకు కూడా పాన్ ఇండియా స్టేటస్ వస్తుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.













