Peddi: పెద్ది ఆడియో రేట్స్ కు కళ్లు చెదిరే ధర
ఉప్పెన(Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన(Buchibabu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) చేస్తున్న సినిమా పెద్ది(Peddi). పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తుండటం, కీలక పాత్రలో శివరాజ్ కుమార్(Siva Raj Kumar) కనిపించనుండటం అన్నింటికీ మించి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకు సంగీతం అందించడం పెద్దిపై హైప్ ను భారీగా పెంచుతున్నాయి.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. పెద్ది ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ టీ సిరీస్(T Series) సొంతం చేసుకున్నట్టు తెలియచేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ ఆడియో రైట్స్ కోసం సదరు ఆడియో కంపెనీ చిత్ర నిర్మాతలకు ఏకంగా రూ.37 కోట్లు ముట్టజెప్పిందని సమాచారం.
పెద్ది సాంగ్స్ ను టీ సిరీస్ లో వినొచ్చని చెప్తూ, పెద్ది గ్లింప్స్ ను ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు బుచ్చిబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ గ్లింప్స్ గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. ఈ గ్లింప్స్ రిలీజయ్యాక చాలా కాలం పాటూ దాని గురించే మాట్లాడుకుంటారని, చరణ్ ఫ్యాన్స్ తో పాటూ సాధారణ సినీ ప్రియులకు కూడా పెద్ది గ్లింప్స్ మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్తున్నారు.













