Ram Charan: చరణ్ న్యూ లుక్ బుచ్చిబాబు కోసమేనా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన కామినేని(Upasana Kamineni) సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ఫొటోను ఉపాసన ఇటీవల షేర్ చేసింది. అందులో అందరూ వైట్ అండ్ వైట్ దుస్తులు వేసుకున్నారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని తలకు టోపీ పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
రామ్ చరణ్ ఫుల్ గా గడ్డం పెంచి, రఫ్ లుక్ లో మును పెన్నడు లేని విధంగా ప్రత్యేకంగా కనిపించాడు. అయితే చరణ్ మామూలుగానే ఇలా గడ్డం పెంచి ఈ లుక్‌లోకి మారాడా లేదా బుచ్చిబాబుతో చేయనున్న RC16 కోసం ఇలా తయారయ్యాడా అనే ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలుచేస్తున్నాయి. ఆల్ హార్ట్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలో గ్లోబల్ స్టార్ కేవలం గడ్డంతో మాత్రమే కాదు, లావుగా కూడా కనిపిస్తున్నాడు.
సాధారణంగా ఎప్పుడు స్లిమ్ గా ఉండే చరణ్ ఒక్కసారిగా ఇలా లావుగా దర్శనమిచ్చేసరికి ఇది కచ్ఛితంగా బుచ్చిబాబు(Buchibabu) సినిమా కోసమేనని అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా చరణ్ నయా లుక్ వెనుక కారణం ప్రస్తుతానికైతే కొశ్చన్ మార్క్ గానే ఉంది. ఇక, చరణ్ కొత్త లుక్ ఇదేనంటూ ఈ ఫోటోను మెగా ఫ్యామిలీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.













