బాలీవుడ్ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ?
ఆర్ఆర్ఆర్ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. గేమ్ ఛేంజర్ పూర్తయిన తర్వాత చరణ్, బుచ్చిబాబు సానతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇప్పటికే బుచ్చిబాబు సినిమా కోసం చరణ్ వరుసగా డేట్స్ ఇచ్చేలా ప్లానింగ్ కూడా జరిగింది.
చరణ్- బుచ్చిబాబు కలయికలో రానున్న సినిమా చరణ్ కు 16వ సినిమా. ఆ సినిమా ఇంకా మొదలవక ముందే చరణ్17 గురించి ప్రచారం మొదలైంది. బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా భన్సాలీతో చరణ్ సినిమా చేయబోతన్నట్లు వార్తలొస్తున్నాయి. గత కొంతకాలంగా తరచూ చరణ్ ముంబై వెళ్లడం వెనుకున్న రీజన్ ఇదే అంటున్నారు.
11వ శతాబ్ధానికి చెందిన సుహల్ దేవ్ అనే పోరాట యోధుడి గాధను సినిమాగా మలచాలని భన్సాలీ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. అతి తక్కువ సైన్యంతో ఘాజి సలార్ మసూద్‌ను సుహల్ దేవ్ ఎలా ఓడించి చంపాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో కానీ ఒకవేళ ఇది నిజమైతే మాత్రం చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు.













