Ram Charan: ఆర్సీ 16లో చరణ్ లుక్ ఇదే.. భలే కూల్ గా కనిపిస్తున్నాడే!
రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు(buchibabu sana) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ప్రస్తుతం చరణ్ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పిక్ లో చరణ్ వైట్ టీ షర్ట్ పై బ్లాక్ కలర్ స్వెట్ షర్ట్ వేసుకుని, నల్ల కళ్లద్దాలు, స్టైల్ గా టోపీ పెట్టుకుని గుబురు గడ్డంతో చాలా కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు.
అన్నింటికంటే ఈ ఫోటోలో అందరినీ మెయిన్ గా ఎట్రాక్ట్ చేస్తున్నది అక్కడ ఉన్న పిల్లాడిని చరణ్ దగ్గరకు తీసుకుని మరీ ఫోటో దిగడం. అయితే ఈ ఫోటోలోని బాబు మరెవరో కాదు. బిగ్ బాస్(Bigg boss) కంటెస్టెంట్ మరియు మూవీ ఆర్టిస్ట్ విశ్వ(Viswa) కొడుకు. ఆర్సీ16లో తాను నటించనున్నట్టు విశ్వ ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఆర్సీ16(RC16) హైదరాబాద్ లో జరుగుతుండగా, ఈ మూవీ సెట్స్ కు విశ్వ తన ఫ్యామిలీని తీసుకెళ్లి బ్రేక్ లో రామ్ చరణ్ ను కలిసి ఫోటో దిగి ఆ ఫోటోను తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని పోస్ట్ చేశాడు. ఇక సినిమా విషయానికొస్తే జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు. మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్సీ16 నుంచి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.













