RC16: నెవర్ బిఫోర్ లుక్ లో చరణ్
రామ్ చరణ్(Ram charan), శంకర్(Shankar) కలయికలో వచ్చిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా డిజాస్టర్ అయింది. దీంతో దాన్ని అలా వదిలేసి తర్వాత బుచ్చిబాబు(Buchi Babu)తో చేయనున్న సినిమా కోసం చరణ్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మైసూరులో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసి గ్యాప్ తీసుకున్న చరణ్ ఇప్పుడు రెండో షెడ్యూల్ కు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్స్ లో నైట్ సీన్స్ ను షూట్ చేయనున్నారట. నైట్ షూటింగ్ కు అనుకూలంగా ఉండేలా ఈ సెట్స్ ను రెడీ చేశారట. ఫిబ్రవరి 1 నుంచి చరణ్ ఆర్సీ16(RC16) షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని, మొత్తం నైట్ సీన్సే కావడంతో చరణ్ కూడా నైట్ మాత్రమే షూటింగ్ కు హాజరు కానున్నాడు.
మరి బుచ్చిబాబు రాత్రంతా షూట్ చేస్తాడా లేక కొన్ని గంటలపాటూ వర్క్ చేసి తర్వాత ప్యాకప్ చెప్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం చరణ్ భారీగా గెడ్డం, జుట్టు పెంచి శరీరాన్ని ఇంకా స్ట్రాంగ్ గా రెడీ చేసి భారీ దేహంతో తయారయ్యాడట. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా కొత్తగా, నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని సమాచారం.













