‘ఆచార్య’ లో రామ్ చరణ్ వైరల్ లుక్ కేక?
అది అఫీషియల్ లుక్ అని కొందరు అంటుంటే కాదని కొందరు అంటున్నారు. అయితేనేం అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆచార్య. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా ఒక పాత్రలో కనిపిస్తాడని తెలిసిందే. మొదట 10 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ పాత్రని బాగా రావడంతో పొడిగించారని తెలుస్తుంది. ఆచార్య సినిమాలో రాం చరణ్ రోల్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రాం చరణ్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
అయితే రాం చరణ్ లుక్ చూస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం. వెరైటీ లుక్ లో రాం చరణ్ లుక్ అరుపులు పెట్టిస్తుందని చెప్పొచ్చు. అలనాడు మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రం లో గెట్ అప్ లా ఉంది రాం చరణ్ ఆచార్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు పాత్రకు ఈక్వల్ గా చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఆచార్య సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన రష్మిక నటిస్తుందని టాక్. చరణ్ లుక్ అఫీషియల్ అయితే మాత్రం ఆచార్యలో చరణ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని ఫిక్స్ అవ్వొచ్చు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామరాజు పాత్ర చేస్తున్న రాం చరణ్. ఆ పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఆచార్యలో చేస్తున్నాడని తెలుస్తుంది.













