మరోసారి పిఠాపురం వెళ్లనున్న చరణ్?
ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ పిఠాపురంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు పిఠాపురంలో పర్యటించిన చరణ్, ఫలితాలొచ్చిన మరుసటి రోజు మరోసారి పిఠాపురంలో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిఠాపురంలో పవన్ గెలుపు తధ్యమని ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ఇలాంటి టైమ్ లో జూన్ 5న పిఠాపురంలో జరగనున్న మనమే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రావడానికి రామ్ చరణ్ ఓకే చెప్పాడన్న వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పిఠాపురంలో తన బాబాయి గెలుస్తున్నాడన్న కారణం, శర్వానంద్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అనే మరో కారణంతోనే చరణ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడానికి ఒప్పుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.
శర్వానంద్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహంచాడు. ఈ నెల 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను జోరుగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అసలు పిఠాపురంలో ఎందుకు ప్లాన్ చేశారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కాగా ఈ సినిమా విజయం టీమ్ లోని ప్రతి ఒక్కరిక ఎంతో కీలకం.













