RC16: రెహమాన్ కంపోజింగ్‌లో చరణ్ గొంతు విప్పుతాడా?
గేమ్ ఛేంజర్(Game Changer) తో డిజాస్టర్ అందుకున్న రామ్ చరణ్(Ram Charan) తన తర్వాతి సినిమాను బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీ16గా రూపొందుతున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్సీ16 కోసం రెహమాన్ మూడు పాటలను రెడీ చేశాడని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా రామ్ చరణ్ ఓ పాట పాడే సూచనలు కనిపిస్తున్నాయి. రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఓ ఫోక్ బిట్ సాంగ్ ను హీరోతో పాడించాలని బుచ్చిబాబు చూస్తున్నాడట.
ఒకవేళ రామ్ చరణ్ బుచ్చిబాబు చెప్పిన దానికి కన్విన్స్ అయి ఈ సినిమాలో పాట పాడితే ఆర్సీ16కు ఇదో స్పెషల్ ఎట్రాక్షన్ అవడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Siva raj kumar) కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.













