గేమ్ ఛేంజర్ లో చరణ్ కెరీర్ బెస్ట్ ఇంట్రో
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని శంకర్ టీమ్ చాలా వేగంగా షూటింగ్ ను జరుపుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఓ రాజకీయ కారణం వల్ల ఐఏఎస్ ఆఫీసర్ లాగా పాత బస్తీకి రావాల్సి ఉంటుంది. కానీ విలన్ వేసిన ప్లాన్ వల్ల రోడ్డు మార్గం మొత్తం బ్లాక్ అవడంతో ఏకంగా హెలికాప్టర్ లో కలెక్టర్ రామనందన్ గా రామ్ చరణ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.
ఈ సీన్ ను శంకర్ ఓ రేంజ్ లో తెరకెక్కించాడని చూసిన వాళ్లు చెప్తున్నారు. సినిమా మొత్తంలో ఇది హైలైట్ గా నిలవడంతో పాటూ చరణ్ ఫ్యాన్స్ కు గూస్బంప్స్ రావడం ఖాయమంటున్నారు. చరణ్ బెస్ట్ ఇంట్రోస్ లో ఇది ఒకటిగా నిలుస్తుందట. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే దిశగా దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి సినిమాకు ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.













