రేటు పెంచిన రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్థాయిలో తన క్రేజ్ ను పెంచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమాలపై భారీ బజ్ నెలకొంది. దానికి తగ్గట్టే చరణ్ తన తర్వాతి సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు, చరణ్ తో సినిమాను చేయనున్నాడు చరణ్.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగింపు దశలో ఉంది. తన షూటింగ్ పార్ట్ ను చరణ్ త్వరలోనే పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని, బుచ్చిబాబు దర్వకత్వంలో చేయనున్న సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు. భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఆర్సి 16 కోసం రామ్ చరణ్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇప్పుడు నెట్టింట ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు రామ్ చరణ్ ఏకంగా రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నారట. చరణ్ ఇప్పటికే తన రెమ్యూనరేషన్ ను బాగా పెంచినట్లు తెలుస్తోంది. 30% పెంచాడని కొందరంటుంటే మరికొందరు గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలంటున్నారు. మరి ఇందులో ఏ మేర నిజముందో తెలియాల్సి ఉంది.













