మహేష్ నో అన్నాడు.. రామ్‌చరణ్ ఓకే చెప్పాడు
ప్రభాస్ హీరోగా నటించిన `మున్నా`తో డైరెక్టర్‌గా పరిచయమైన వంశీ పైడిపల్లి ఆ తర్వాత సినిమాలన్నీ పెద్ద హీరోలతోనే చేశాడు. ఎన్టీఆర్‌తో `బృందావనం`, రామ్‌చరణ్‌తో `ఎవడు`, నాగార్జున, కార్తీలతో `ఊపిరి`, మహేష్‌తో `మహర్షి` వంటి విభిన్నమైన సినిమాలు రూపొందించాడు. అయితే వంశీ చేసే ప్రతి సినిమాకూ మినిమం సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తీసుకున్నా ఇప్పటివరకు మంచి సినిమాలే చేశాడు. ఊపిరి విడుదలైన మూడు సంవత్సరాల తర్వాత మహేష్‌తో చేసిన మహర్షి విడుదలైంది. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్లో వెంటనే సినిమా ఉంటుందని అనుకున్నారు. అనిల్ రావిపూడితో మహేష్ చేసిన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జరుగుతున్నపుడు మహేష్‌ని వంశీ కలవడం, తాను అనుకుంటున్న స్టోరీ నేరేట్ చెయ్యడం జరిగిందట. అయితే వంశీ చెప్పిన పాయింట్ మహేష్‌కి నచ్చింది. అయితే పూర్తి స్థాయి కథ నచ్చకపోవడంతో వంశీకి నో చెప్పేశాడు. ఈ సినిమా నో చెప్పిన వెంటనే పరశురామ్‌తో సర్కారువారి పాట ఎనౌన్స్ చేశాడు మహేష్.
తన కథతో మహేష్‌ని మెప్పించలేకపోయిన వంశీ మరో హీరో అన్వేషణలో పడ్డాడు. కొంతమందిని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. కానీ, ఏ హీరోతోనూ సెట్ అవ్వలేదు. ఫైనల్‌గా రామ్‌చరణ్ ఈ సినిమా చెయ్యడానికి ముందుకొచ్చాడట. మహేష్ నో చెప్పిన కథ విన్న రామ్‌చరణ్ ఎస్ చెప్పాడట. 2014లో వీరిద్దరి కాంబినేషన్లో ఎవడు చిత్రం వచ్చింది. అప్పటికి అది ఓ విభిన్నమైన సినిమాగా అందర్నీ మెప్పించింది. కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించిన ఆ సినిమా తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి మరో మంచి సినిమా చెయ్యాలని ప్రయత్నించారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు. మళ్లీ ఆరు సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి దిల్‌రాజు నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` సినిమాలో కూడా రామ్‌చరణ్ ఓ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిసింది. ఈ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.













