చరణ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ చేస్తున్న రామ్ చరణ్, తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చేయనున్నాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. అయితే ఈ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న అంశమొకటి ఉంది. అదే రెహమాన్ మ్యూజిక్.
రీసెంట్ టైమ్స్ లో ఆయన్నుంచి వచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఏదీ లేదంటే అతిశయోక్తి లేదు. పొన్నియన్ సెల్వన్, లాల్ సలామ్ లాంటి సినిమాలకు కూడా రెహమాన్ గొప్పగా అనిపించే పాటలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన చేతిలో పదికి పైగా సినిమాలున్నాయి. ఇంత ఒత్తిడిలో రెహమాన్ నుంచి బెస్ట్ అవుట్పుట్ రాబట్టుకోవడమంటే మాటలు కాదు.
పైగా ఇప్పటివరకు రెహమాను నుంచి వచ్చిన స్ట్రయిట్ తెలుగు సినిమాలకు ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉప్పెనకు దేవీ శ్రీ ప్రసాద్ ఎంత ప్లస్ అయిందో తెలుసు. అలాంటిది చరణ్ తో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఊర మాస్ సినిమాకు మ్యూజిక్, రీరికార్డింగ్ ఎంత కీలకమన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి రెహమాన్ నుంచి బుచ్చిబాబు ఎలాంటి ట్యూన్స్ ను రాబట్టుకుంటాడో చూడాలి.













