టెన్షన్ పడుతున్న చరణ్ ఫ్యాన్స్
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా కు తెలుగులో అనుకున్న రేంజ్లో రిజల్ట్ రాలేదు. కొన్ని చోట్ల అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. బిసి సెంటర్స్ లో నామమాత్రపు వసూళ్లు తెచ్చుకున్న ఈ సినిమా ఫలితాన్ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
చరణ్ ఫ్యాన్స్ కంగారుకు కారణం లేకపోలేదు. శంకర్ దర్శకత్వంలో చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకు కథను అందించింది కార్తీక్ సుబ్బరాజే. గేమ్ ఛేంజర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దశాబ్దాల క్రితం బ్యాక్ డ్రాప్‌తో జరుగుతుంది. అప్పటి పాలిటిక్స్, పార్టీ ఫిరాయింపులు, వీటి చుట్టూ కథను అల్లుకున్నట్లు టాక్. జిగర్తండలో కూడా పాలిటిక్స్‌ను టచ్ చేశాడు కార్తీక్ సుబ్బరాజ్.
జిగర్తండలో పాలిటిక్స్ ను మరీ ఓవర్ గా ప్రెజెంట్ చేసిన కార్తీక్, గేమ్ ఛేంజర్ కథను ఎలా రాశాడో అని చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే కార్తీక్, గేమ్ ఛేంజర్ కు కథను మాత్రమే అందించాడు, శంకర్ ఆ కథను తన స్క్రీన్ ప్లే కు అనుగుణంగా మార్చుకుని ఉంటాడు కాబట్టి టెన్షన్ పడే పన్లేదని కొందరు అంటున్నారు. ఏదేమైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే వరకు చరణ్ ఫ్యాన్స్ కు ఈ టెన్షన్ తప్పేలా కనిపించట్లేదు.













