ఊపిరి పీల్చుకుంటున్న చరణ్ ఫ్యాన్స్
మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్లుగా ఆయన తన కెరీర్ ను కొనసాగిస్తున్న తీరు మ్యూజిక్ లవర్స్ కు ఎప్పటికీ స్పెషలే. కానీ రెహమాన్ నుంచి ఒకప్పటిలా నాణ్యమైన సంగీతం మాత్రం రావట్లేదని కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. ఆయన నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా గుర్తుపెట్టుకునే పాటలు కానీ, మంచి బీజీఎం కానీ లేవు.
ఇక అసలు విషయానికొస్తే, గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సానతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు రెహమానే సంగీతం అందించనున్నాడు. ఆయన్నుంచి మంచి మ్యూజిక్ రాని టైమ్ లో రెహమాన్ ను ఫైనల్ చేయడంతో చరణ్ ఫ్యాన్స్ లో సందేహాలొచ్చాయి. కానీ రీసెంట్గా కమల్‌హాసన్ 234 సినిమా తగ్స్ లైఫ్ ప్రోమోకు రెహమాన్ ఇచ్చిన బీజీఎం చాలా గొప్పగా ఉండటంతో చరణ్ ఫ్యాన్స్ డౌట్స్ మొత్తం తీరినట్లే అనిపిస్తోంది.
ఎంతో కాలం తర్వాత రెహమాన్ నుంచి మంచి అవుట్‌పుట్ వచ్చిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. దీంతో బుచ్చిబాబు సరైన నిర్ణయమే తీసుకున్నాడని ఇప్పుడు అంటున్నారు. ఏదేమైనా మంచి ట్యూన్స్ తీసుకోవడమనేది డైరెక్టర్ ను బట్టి ఉంటుంది. ఇంకా చరణ్-బుచ్చిబాబు సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ కాలేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ గేమ్ ఛేంజర్ వల్ల లేటవుతూ వస్తోంది.













