చరణ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆయనపైనే
ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఇండియన్2 సినిమా రిలీజై యావరేజ్ టాక్ ను కూడా తెచ్చుకోలేకపోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం కమల్ హాసన్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా రామ్ చరణ్ ఫ్యాన్సే ఎదురుచూశారు. దానికి కారణం ఇండియన్2 తీసిన డైరెక్టర్ శంకరే రామ్ చరణ్ తో కూడా గేమ్ ఛేంజర్ తీస్తున్నాడు. దీంతో ఇండియన్2 రిలీజైతే దాని రిజల్ట్ ను బట్టి గేమ్ ఛేంజర్ అవుట్పుట్ మీద ఓ అంచనాకు రావొచ్చనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియన్2 శంకర్ కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ గా నిలుస్తుందని సినిమా చూసిన వారంతా చెప్తున్నారు. శంకర్ కెరీర్లో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ వాటిలో శంకర్ మార్క్ కనిపిస్తుంది. కానీ ఇండియన్2 కాదు.
తాను క్రియేట్ చేసిన కల్ట్ క్యారెక్టర్ అయిన సేనాపతిని ఇండియన్2లో ఆయన తేల్చి పడేసిన తీరు ఆడియన్స్ కు షాకిస్తుంది. ఇండియన్2 చూసి చరణ్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నాడు. ఇదే నైపుణ్యాన్ని శంకర్, గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా చూపిస్తే ఆ సినిమా పరిస్థితేంటని కంగారు పడుతున్నారు. కాకపోతే గేమ్ ఛేంజర్ సినిమాకు కథ రాసింది ఆయన కాదు. తమిళ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చిన కథతో శంకర్ గేమ్ ఛేంజర్ తీశాడు. ట్రెండీగా ఆలోచించే కార్తీక్. తన కథలో ప్రత్యేకతను చాటడంలో ముందుంటాడు. మంచి కథ ఉంటే శంకర్ తన మ్యాజిక్ తను చేస్తాడు కాబట్టి చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంలో నిరాశ పడకుండా, కార్తీక్ సుబ్బరాజ్ పై భారం వేస్తే చాలు.













