శంకర్‌పై చరణ్ ఫ్యాన్స్ ఫైర్
రామ్ చరణ్ అభిమానులు అసహనంతో రగలిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ తో సినిమాను అనౌన్స్ చేసిన చరణ్ ఇప్పటి వరకు ఆ సినిమాను పూర్తి చేసింది లేదు, వేరే సినిమా చేసింది కూడా లేదు. కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాను చేస్తూ శంకర్ అసలు గేమ్ ఛేంజర్ గురించి పూర్తిగా మర్చిపోయినట్లున్నాడు అని చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసి రెండున్నరేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయింది ఒక్క పోస్టర్ మాత్రమే. అది కూడా చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్సులు అసలు లేవని తేలిపోయింది. సర్లే వచ్చే ఏడాది సమ్మర్‌కైనా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూపులు చూస్తున్నారు.
మరోవైపు గేమ్ ఛేంజర్ కంటే ఆలస్యంగా మొదలైన ప్రాజెక్ట్స్ చాలా ప్లాన్డ్ గా రిలీజ్ డేట్ ను టార్గెట్ చేసుకుని షూటింగ్ ను జరుపుకుంటుంటే శంకర్ మాత్రం తమ హీరోను ఇలా లైట్ తీస్కోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సినిమా భారం మొత్తం శంకర్ మీదే ఉండటంతో నిర్మాత అయిన దిల్ రాజు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. అసలు ఈ సినిమా షూటింగ్ ఏ దశలో ఉందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చిత్ర యూనిట్‌కే తెలియని పరిస్థితిలో ఉందంటే చరణ్ ఫ్యాన్స్ శంకర్ పై మండిపడటంలో ఆశ్చర్యమేమీ లేదు.













