ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ డబుల్ ట్రీట్ ఇవ్వనున్న చరణ్
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. శంకర్ బిజీ షెడ్యూల్స్ కారణంగా గేమ్ ఛేంజర్ లేటవుతూ వస్తోంది. లేదంటే ఇప్పటికే గేమ్ ఛేంజర్ రిలీజ్ కావాల్సింది.
ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాగానే చరణ్, బుచ్చిబాబు సినిమా సెట్స్ లో కాలు పెట్టనున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. బుచ్చిబాబు సినిమాలో చరణ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి పాజిటివ్ కాగా, మరో పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ లో కూడా చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో డబుల్ రోల్ లో తన ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడన్న మాట.













