కామెడీ చేయనున్న చరణ్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే వెల్లడించాడు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తన 16వ సినిమాను చేయనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రలో ఫుల్ కామెడీ టచ్ ఉంటుందని విని ఫ్యాన్స్ షాకవుతున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో రామ్ చరణ్ స్వయంగా ఈ మాట చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి పెద్ది అనే టైటిల్ తప్పించి ఎలాంటి లీకులు బయటకు రాలేదు.
ఇప్పటివరకు చరణ్ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ఏ సినిమాలో చేయలేదు. గతంలో నాయక్ లాంటి సినిమాలో బ్రహ్మానందం లాంటి ఆర్టిస్టుల హెల్ప్ తో కామెడీ చేశాడు కానీ సోలోగా మాత్రం చేయలేదు. ఇప్పుడు బుచ్చిబాబు, చరణ్ తో సోలోగా కామెడీ చేయించేలా తన పాత్రను డిజైన్ చేశాడట. అలా అని ఇదేమీ కామెడీ ఎంటర్టైనర్ కాదని ఫస్టాఫ్ లో మాత్రమే కామెడీ ఎపిసోడ్స్ ఉంటాయని, సెకండాఫ్ లోని సీరియస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అంటున్నారు.













