మరో స్పెషల్ సాంగ్ చేయనున్నపూజా ..
ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పై ఒక సాంగ్ ను తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఆచార్య కోసం రామ్ చరణ్, పూజా హెగ్డేలపై ఒక సాంగ్ ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. అప్పట్లో రంగస్థలంలో జిగిలు రాణి అవతారమెత్తిన పూజాతో మళ్లీ అలాంటి సాంగే ప్లాన్ చేశారని అందరూ అనుకున్నారని కానీ అదీ ఇదీ వేరు అని తాజా సమాచారం.
ఈ సాంగ్ మొత్తం మాంటేజెస్ తోనే ఉండనుందట. చరణ్ ఊహల్లో మాత్రమే పూజ కనిపిస్తుందట. అవన్నీ మాంటేజ్ షాట్స్ లోనే తెరకెక్కస్తున్నారని తెలుస్తుంది. జిగేల్ రాణి రేంజ్ లో స్టెప్పులు ఉండకపోవచ్చని చెప్తున్నారు. ఈ సాంగ్ సినిమాలో కీలకం కానుందని, స్పెషల్ సాంగ్ కాదని అంటున్నారు. కాబట్టి ఈ సాంగ్ లో పూజా నుంచి స్టెప్పులు ఆశించే పన్లేదన్నమాట. ఒక వైపు భారీ సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉన్న పూజా ఇలా స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించడానికి ఓకే చెప్పడం మంచి విషయమే. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు.













