రిస్క్ తీసుకుంటున్న చరణ్, ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ సినిమాతో తమ క్రేజ్ ను దేశం నలుమూలలా వ్యాపింప చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ సినిమా తర్వాత వారితో సినిమాలు చేయడానికి పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు సైతం రెడీగా ఉన్నారు. కానీ వారు మాత్రం తమ మాతృ భాష తర్వాతే ఏదైనా అంటూ తెలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ తర్వాత వారిద్దరూ ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే చరణ్, శంకర్‌తో గేమ్ ఛేంజర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కానీ శంకర్ ట్రాక్ రికార్డ్ గత కొన్ని సినిమాలుగా ఏమంత బాలేదు. రోబో తర్వాత శంకర్ కు ఒక్క హిట్ కూడా లేదు. కానీ చరణ్ అవేమీ పట్టించుకోకుండా శంకర్ తో సినిమాను చేస్తుండటంతో చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ రిజల్ట్ విషయంలో కంగారు పడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ కూడా కొరటాల శివ తో దేవర సినిమా చేస్తున్నాడు. ఎంతో టైమ్ తీసుకుని కొరటాలతో కథకు సాన పెట్టించి దేవరను తీస్తున్నాడు. అయితే కొరటాల నుంచి వచ్చిన గత సినిమా ఆచార్య ఆయన కెరీర్ కు మాయని మచ్చలా మాఇంది. దీంతో దేవర ఎలాంటి ఫలితాన్నిస్తుందా అని తారక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ తర్వాత తమ ఈ ఇద్దరూ హీరోలు సక్సస్ ను నమ్ముకుని ముందుకెళ్తున్నారని చెప్పాలి.













