OG: చరణ్ నోట ఓజి మాట
ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కు ఓజి(OG) తప్ప మరే సినిమా కనిపించడం లేదు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎక్కడ కనిపించినా దాని ప్రస్తావన తీసుకురాకుండా ఉండట్లేదు. రీసెంట్ గా పవన్(Pawan Kalyan) మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఫ్యాన్స్ బాగా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఓజి ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది.
రీసెంట్ గా గేమ్ ఛేంజర్(Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్(Ram Charan), తమన్(Thaman) కు కూడా ఇది తప్పలేదు. తాను సంక్రాంతికి రాకపోయి ఉంటే కళ్యాణ్ బాబాయ్ ని ఎలాగైనా ఒప్పించి సంక్రాంతికి ఓజీ రిలీజయ్యేలా చూసేవాడినని చెప్పడంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం విజిల్స్ తో హోరెత్తింది. తర్వాత తమన్ స్పీచ్ మొదలయ్యాక ఆయన్ని కూడా ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేశారు.
గతంలో వకీల్ సాబ్(Vakeel Saab), భీమ్లా నాయక్(Bheemla Nayak), బ్రో(Bro) సినిమాకు మించి ఓజీ లో తన పనితనం ఉంటుందని తమన్ చెప్పడం ఫ్యాన్స్ కు మంచి కిక్ ను ఇచ్చింది. అంతేకాదు ఓజి సినిమా ఇండియన్ హిస్టరీని తిరగరాసే రేంజ్ లో ఉంటుందని తమన్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ కు ఓజి ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.













