ఇస్మార్ట్ శంకర్‌కు గుమ్మడికాయ కొట్టేశారు
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. నభా నటేశ్, నిధి అగర్వాల్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్, చార్మికౌర్ నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. టైటిల్‌కు తగ్గట్టే రామ్ లుక్ కొత్తగా ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు, మణిశర్మ సంగీత సారథ్యంలో విడుదలైన నాలుగు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు క్రేజ్ బావుంది. ఈ నెల 18న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అని పూరి జగన్నాథ్ తెలిపారు.













