కోహ్లీ బయోపిక్కు రెడీ అంటున్న రామ్
ఇండియన్ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో అవకాశం కోసం ఎంతో మంది బాలీవుడ్ హీరోలు కూడా రెడీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్, జాన్ అబ్రహం లాంటి హీరోలు ఓపెన్ గా చెప్పేశారు. ఛాన్స్ వస్తే తప్పకుండా కోహ్లీ బయోపిక్ లో నటిస్తామని, అతని లైఫ్ స్టోరీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుందని, అలాంటి క్యారెక్టర్లు చాలా రేర్ గా వస్తాయని భావిస్తుంటారు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి కూడా విరాట్ బయోపిక్ లో నటించడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. వాళ్లలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాగా మరొకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను కోహ్లీ బయోపిక్ లో నటించడానికి రెడీగా ఉన్నట్లు రామ్ వెల్లడించాడు. తనకు, కోహ్లీకి దగ్గరు పోలికలుంటాయని అంటుంటారని, ఒకవేళ ఎవరైనా కోహ్లీ బయోపిక్ ఛాన్స్ ఇస్తే తప్పకుండా నటిస్తానని రామ్ వెల్లడించాడు.
నార్మల్ లైఫ్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా కోహ్లీ ఎదిగిన తీరు చాలా మంది స్పూర్తి దాయకంగా ఉంటుందని, అలాంటి క్యారెక్టర్లు చేయడానికి కూడా ఎంతో ఛాలెంజింగ్ ఉంటాయని, తెలుగులో అలాంటి సినిమాలు ఎక్కువగా రావాలని, కమర్షియల్ సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడట్లేదని వాళ్లు కూడా కొత్తదనం కోరుకుంటున్నారని, కథలో ఎమోషన్ కీలకం కాబట్టి అలాంటి కథలు ఇప్పుడు అవసరమని రామ్ అన్నాడు. కాగా రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రీసెంట్ గా భారీ అంచనాలతో రిలీజై డిజాస్టర్ గా మిగిలింది.













