ఖగోళ శాస్త్రవేత్తగా అందాల భామ ?
అందాల భామ రకుల్‌ప్రీత్ సింగ్ తన కెరీర్లో తొలిసారిగా ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తమిళస్టార్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రంలో రకుల్ ఖగోళ శాస్త్రవేత్తగా నటిస్తున్నారని సమాచారం. టైటిల్ ఇంకా పెట్టని ఈ చిత్రాన్ని రవికుమార్ తెరకెక్కిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. 24 ఎఎం స్టూడియోస్ పతాకంపై ఆర్డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్స్ ఈ చిత్రానికి కీలకం కానున్నాయని తెలుస్తోంది. కాగా రకుల్ తాజాగా సూర్య సరసన ఎన్జీకే చిత్రం, ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో నటిస్తోంది.













