స్పెషల్ సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్
నాని, మనం ఫేం విక్రమ్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఇటీవల లాంచ్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా, భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, నానితో కలిసి స్టెప్పులు వేయనున్నారు. రకుల్ స్పెషల్‌సాంగ్‌లో నటించడం ఇదే తొలిసారి.













