రకుల్ అభిమానులకు గుడ్ న్యూస్
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలిపిన రకుల్ ప్రస్తుతం స్వీయ నిర్భందంలో ఉంది. ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించిన ఈ అమ్మడు.. కరోనా నుంచి బయటపడటానికి అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటున్నట్టు పేర్కొంది. అంతేకాదు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ చక్కటి పౌష్టికాహారం తీసుకుంటున్నా. వీటికి అనుబంధంగా విటమిన్ మాత్రలు కూడా వేసుకుంటున్నా అని పేర్కొంది.
తాజాగా తనకు నెగెటివ్ వచ్చినట్టు తెలియజేసింది రకుల్. హాయ్ ఫ్రెండ్స్ నాకు కరోనా నెగెటివ్ వచ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు 2021ను పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండి మాస్క్లు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతున్నాను అని రకుల్ సృష్టం చేసింది.













