రకుల్ రిక్షా తొక్కింది ఎందుకో తెలుసా?
గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మూడు చక్రాల బండి ఎక్కింది. ప్రస్తుతం కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న థీరన్ అథికరం ఒండ్రు చిత్రంలో కథానాయికగా నటిస్తుంది రకుల్. ఈ మూవీ చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతుండగా, ఓ సన్నివేశంలో భాగంగా రకుల్ రిక్షా తొక్కింది. అయితే ఈ సీన్ కోసం ముందుగానే ఈ అమ్మడు రిక్షా తొక్కడం ప్రాక్టీస్ చేసిందట. అయితే రకుల్ రిక్షా తొక్కుతున్న సమయంలో ఆమెకి రక్షణగా యజమాని వెనుకనే కూర్చొని ఉన్నాడట. థీరన్ అథికరం ఒండ్రు తెలుగులో ఖాకీ పేరుతో విడుదల కానుంది. రకుల్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోను వరుస ఆఫర్స్ అందుకుంటుంది. రకుల్ నటించిన స్పైడర్, జయ జానకి నాయక చిత్రాలు విడుదల కి సిద్ధం కాగా, బాలీవుడ్ లో సిద్ధార్ద్ మల్హోత్రాకి జోడిగా అయారి అనే సినిమా చేస్తుంది.













