రష్మికతో ఇప్పటికీ మాట్లాడుతున్నా
కన్నడలో ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన రష్మికకు ఆ సినిమా హీరో మరియు నిర్మాత అయిన రక్షిత్ శెట్టితో ప్రేమ చిగురించి, వారిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిన సంగతి తెలిసిందే. రష్మిక, రక్షిత్ ప్రేమలో ఉన్నప్పుడే రష్మికకు టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఆ టైమ్ లోనే రక్షిత్ నుంచి విడిపోయిన రష్మికను కన్నడిగులు ఆమెను బాగా ట్రోల్ చేశారు. తెలుగు సినిమాల్లో నటించే అవకాశం రావడంతో రక్షిత్‌ను, కన్నడ ఇండస్ట్రీని వదిలేసిందని అందరూ రష్మికపై విరుచుకుపడ్డారు. బ్రేకప్ తర్వాత రష్మిక రక్షిత్‌తో కనీసం మాట్లాడటం కూడా లేదని అందరూ అన్నారు. ఈ విషయంలో తాజాగా రక్షిత్ స్పందించాడు.
ఇప్పటికీ రష్మికతో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని, తరచూ మాట్లాడుకుంటుంటామని, మెసేజ్‌లు చేసుకుంటామని ఆయన తెలిపాడు. కానీ తమ కామన్ ఫ్రెండ్ అయిన రిషబ్‌కు, రష్మికకు మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని రక్షిత్ తెలిపాడు. నా సినిమా రిలీజైతే తను, తన సినిమా రిలీజైనప్పుడు నేను విష్ చేసుకుంటుంటామని, రష్మిక కెరీర్ గురించి కన్న కలల్ని నిజం చేసుకుంటూ ముందుకు సాగుతున్నందకు సంతోషంగా ఉందని రక్షిత్ తెలిపాడు.













