హాట్ హాట్ గా గ్రీన్ డ్రెస్ లో రకుల్ అందాలు..
ఎప్పుడు హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారుని వెర్రెక్కిస్తుంది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి టెంప్టింగ్ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అప్ డేటెడ్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది రకుల్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త పద్దతిగా కనిపించినా, తర్వాత చాల స్టైలిష్ గా మారిపోయింది. స్విమ్ సూట్, టూ పీసుల్లో రకుల్ ఘాటు ఫోజుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి ఈ అమ్మడు గ్లామర్ పై మరింత కాన్సంట్రేషన్ చేస్తుందని చెప్పాలి. తాజాగా రకుల్ గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ ఔట్ ఫిట్ లో రకుల్ ఇచ్చిన స్టిల్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. రకుల్ జీ అంటూ వెంట పడి మరీ ఫోటోగ్రాఫర్లు క్యాప్చర్ చేసారంటే అతిశయోక్తి లేదు. రకుల్ చెవులకు ధరించిన ఇయర్ రింగ్స్ ఈ పిక్స్ లో హైలైట్ అని చెప్పాలి. రింగులును పోలిన దిద్దులు అమ్మడిని మరింత అందంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక ఫాన్స్ మరియు కుర్రకారు అయితే ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూనే ఉన్నారు. నెట్టింట తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత రకుల్ రేంజ్ మారిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఛాన్సులు లేకపోయినా, చిన్న హీరోలతో నటిస్తూ తెలివిగా తన కెరీర్ ని కాపాడుకుంటుంది. మీడియా ఇంటర్వ్యూల్లోనూ చాలా జాగ్రత్తగా, ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.













